నా చెలీ ...... కవిత 1.విరులవాన కురిసినట్టు వెన్నెలమ్మ నవ్వినట్టు పరిమళించు గంధమేదో పరవశాన తాకినట్టు అరుదెంచెను నా చెలీ, అరుద...
ఇప్పుడే వచ్చారంట
నా "చిన్నారి" కధా కమామిషూ
నా పసితనం లో మా నాన్నగారు అందరికన్నా చిన్నపిల్లని అని "చిన్నమ్మా" అని పిలిచేవారు....మా అమ్మ "చిన్నారీ" అని ముద్దుచేసేది .అమ్మ దేవుని ముందో ,వంట చేసుకుంటూనో .....రక రకాల అష్టకాలను పాట లాగా పాడుతూ ఉండేది...నాన్నగారయితే భాగవతం లో పద్యాలు తీరిక దొరికినప్పుడల్లా ..పడక్కుర్చీలో వాలి కూర్చుని పాడుతూ వుండేవారు.....ఎప్పుడైనా వీలుంటే మమ్మల్ని కూర్చోబెట్టి ఆ పద్యాలకు అర్ధాలు చెప్తూ ఉండేవారు.....అప్పటినుండే తెలుగు ఎంత అందమైన భాషో అని మనసులో ముద్రపడిపోయింది . అలా అలా కొంచెం చిన్నవయసునుండే చుట్టు కనిపించిన ప్రతి విషయాన్నీ....ఇలా చెపితే అందముగా ఉంటుందేమో అని ఊహించుకునేదాన్ని .....
అమ్మతో ఆ విషయాలను పంచుకున్నప్పుడల్లా నన్ను కవితలు వ్రాయమని ప్రోత్సహించేది....అలా అమ్మ మీద మొదటి కవిత వ్రాసాను....ఇంకా నెమ్మది నెమ్మదిగా ప్రకృతి మీద కవితలు వ్రాయటం మొదలెట్టాను .....నోటుబుక్స్ లో .....కాలాంతరములో అవన్నీ ఎక్కడెక్కడొ పడిపోయాయి....ఇదుగో ఇప్పుడు దాదాపు ఒక రెండేళ్ళనుండీ ...నేను కాస్త పెద్దయి ...పిల్లలు కూడా కాస్త ఎదిగి తీరిక చిక్కాక మళ్ళీ నాలో భావుకత నేనున్నాను మర్చిపొయ్యావా అంటూ పలకరించింది .....అందుకు ఫేస్బుక్ సమూహం "అచ్చంగా తెలుగు" నన్ను నేను నిరూపించుకునేలా ప్రోత్సాహాన్ని అందించింది....మావారు శ్రీ వేంకట రమణ గారు కూడా నా కవితలనూ,రచనలనూ బావున్నాయి వ్రాయమంటూ ప్రోత్సహించారు.... బ్నిం గారు జడపద్యాలతో పద్య రచనకు శ్రీకారం చుట్టించారు ఇహ మిత్రులు దుర్గ గారూ,హేమ గారు ....అచ్చంగాతెలుగు, ఫేస్బుక్ లో మిత్రులూ చాలా ఆదరంగా నా రచనలను అక్కున చేర్చుకుని నన్ను ఆశీర్వదించారు....జ్యోతీ వలబోజు గారు నాకు నా రచనలు అన్నింటినీ ఒక చోట చేర్చుకునేలా ఒక బ్లాగ్ తెరవటం నేర్పించి.....డిజైన్ కూడా చేసి ఇచ్చారు.....వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ....నా రచనలు అన్నింటినీ మీతో పంచుకుంటున్నాను...మీరు కూడా చదివి,ఆస్వాదించి ఆదరిస్తారని నమ్ముతూ....మా అమ్మా నాన్నగార్లకు గుర్తుగా, ఇద్దరు చిన్నారి పిల్లలకు గుర్తు గా ...నా బ్లాగ్ కు "చిన్నారి " అని పేరుపెట్టుకున్నాను...ఈ "చిన్నారి " ని మీరు కూడా ప్రోత్సహిస్తారు కదూ ......ధన్యవాదములతో
నాగజ్యోతీసుసర్ల
25-04-2015
ఆరంభ సంరంభం అదిరింది నాగజ్యోతి గారూ ..మనః పూర్వక అభినందనలు..
ReplyDeleteహేమారావు ..
ధన్యవాదములండీ హేమ గారూ
Delete